న్యాయవాదులు ప్రజలకు చట్టాలు, న్యాయ వ్యవస్థ పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. గురువారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆమనగల్లు బార్ అసోసియేషన్ సభ్యుడు యాదిలాల్ రూపొందించిన క్యాలెండర్, డైరీ ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా చైతన్యం, సామాజిక సేవా కార్యక్రమాలలో న్యాయవాదులు తమ వంతు కృషి చేయాలని సూచించారు.