నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యునిగా ఆమనగల్లు మున్సిపాలిటీ కౌన్సిలర్ లక్ష్మణ్ నియమితులయ్యారు. శనివారం ఆయనను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఏబీవీపీ నాయకునిగా రెండుసార్లు మండల బీజేవైఎం అధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని అధిష్టానం గుర్తించి కౌన్సిల్ సభ్యునిగా నియమించినట్లు వివరించారు.