సీఎం రేవంత్ రెడ్డిని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్ పర్సన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యాట గీతా నరసింహ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సీఎంను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీని మరింత బలోపేతం చేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకొని స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు.