కల్వకుర్తి దేవరకొండ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కల్వకుర్తి పట్టణంకు చెందిన అరవింద్, కార్తీక్ లు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం మృతుల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమన్నారు. పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.