ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు 40 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు పెంటయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్మికులు చేసిన ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.