ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో లో వోల్టేజీ సమస్యతో గృహోపకరణాలు తరచూ కాలిపోతున్నాయని, మిషన్ భగీరథ నీరు లేక త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. డ్రైనేజీ, డంపింగ్ యార్డ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.