ఆమనగల్లు: ఆశ్రమ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

75చూసినవారు
ఆమనగల్లు: ఆశ్రమ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
ఆమనగల్లు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఒకరోజు పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ డబ్ల్యుఓ గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్