ఆమనగల్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షునిగా మున్సిపల్ కౌన్సిలర్ కర్నాటి విక్రం రెడ్డి శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికైన ఆయనను బీజేపీ నాయకులు సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో నాయకులు రవి రాథోడ్, సక్రు నాయక్, బొడ్య, పత్య నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.