యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమకు నచ్చిన వృత్తిని ఎంచుకొని స్వయం ఉపాధితో ఎదగాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శనివారం ఆమనగల్లులో ఫ్యాన్సీ షో రూమ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. నాయకులు జగన్, మంగ్లీ రాములు, ధనుంజయ, మానయ్య, విజయ్, శ్రీకాంత్, శ్రీశైలం, రవీందర్, ఫరీద్, స్పందన వెంకటేష్ పాల్గొన్నారు.