చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. జనప్రియ కాలనీ ఫీడర్ పరిధిలోని కాలనీలలో మధ్యాహ్నం 1. 30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 11కేవీ చిత్రా లేఅవుట్ ఫీడర్ పరిధిలోని కాలనీలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని ఆయన తెలిపారు.