నేడు జెడ్పీ చైర్పర్సన్ రాక

65చూసినవారు
నేడు జెడ్పీ చైర్పర్సన్ రాక
కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి శనివారం రానున్నట్లు జెడ్పీ టీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. లేమూరు, కందుకూరు, పులి మామిడి, ధన్నారం గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్, సీసీ రహదారుల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10. 30 గంటలకు లేమూరు గ్రామం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్