హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో అభిషేకం, ఆకు పూజ, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మాజీ జెడ్పీటీసీ దశరత్ నాయక్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వెంకటేష్, రామకృష్ణ, ఆంజనేయ స్వామి భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.