పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
పిస్తా పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. పిస్తా గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బరువును నియంత్రించడంలో మేలు చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. ప్రోటీన్, విటమిన్ B6, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పిస్తా పప్పులు, పాలు మరిగించి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయి.