ఆరెకటికలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు కేటాయించాలని ఆరెకటికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జహంగీర్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ జనాభాలో 20 లక్షల మంది ఉన్న కటికలు కేవలం మటన్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని, మేకల మండీల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న తమను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ కోసం అమరుడైన సునీల్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.