కడ్తాల్ మండలంలో శుక్రవారం నిర్వహించిన ఎక్సైజ్ దాడులలో శుక్రవారం 22 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 8 కేసులు నమోదు చేసినట్లు ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్య చౌహన్ చెప్పారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లె చెలక తండా, వాసుదేవ్ పూర్, కొర్షకుంట తండాలలో దాడులు నిర్వహించి పది కిలోల పటిక, 40 కిలోల బెల్లం స్వాధీనం చేసుకొని 550 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు.