రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన కడ్తాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి పోర్టల్ ను వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో అమలు చేసిన ధరణితో ఉత్పన్నమైన సమస్యలకు చెక్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.