దేశ హితం కోసం పనిచేసే ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరామ్, రాష్ట్ర కమిటీ సభ్యులు క్యామ శ్రీకాంత్ లు చెప్పారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో ఏబీవీపీ నగర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పవన్, ఉపాధ్యక్షులుగా ఉమేష్, సంయుక్త కార్యదర్శిగా శ్రీకాంత్, వివిధ విభాగాల కన్వీనర్లుగా అఖిల్, గణేష్, దశరథం, సభ్యులుగా నరేందర్, సందీప్, పవన్, దిలీప్ లను ఎన్నుకున్నారు.