కడ్తాల్: కాంగ్రెస్ ను దించేందుకు మరో దీక్షా దివస్ చేపట్టాలి

80చూసినవారు
కడ్తాల్: కాంగ్రెస్ ను దించేందుకు మరో దీక్షా దివస్ చేపట్టాలి
రాష్ట్రంలో పాలనను బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో దీక్షా దివస్ చేపట్టాలని మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ చెప్పారు. శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్