కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయం ఆవరణలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని శనివారం కడ్తాల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ రహదారిపై మృతుని బంధువులు, కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వరప్రసాద్ పోలీసులతో చేరుకొని మృతుల బంధువులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.