వయనాడ్ ఎంపీ, ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ పై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ భిధురి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని హితవు పలికారు.