కడ్తాల్ మండలం సాలార్ పూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం మాజీ జడ్పీటీసీ, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం క్రీడల నిర్వహణకు నిలయమని, క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం సంతోషదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, పంతు నాయక్, సాయిలు, జంగయ్య, కుమార్, నరేష్, క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.