కడ్తాల్: కోనో కార్పస్ చెట్లను సంరక్షించండి

61చూసినవారు
కడ్తాల్: కోనో కార్పస్ చెట్లను సంరక్షించండి
ప్రజలు అపోహలు వీడి కోనో కార్పస్ చెట్లను సంరక్షించాలని కల్వకుర్తి నియోజకవర్గ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్ ఛార్జ్ లక్ష్మీనరసింహారెడ్డి కోరారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్ల కార్డులు చేతభూని కోనో కార్పస్ చెట్ల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోనో కార్పస్ చెట్టు అన్ని మొక్కల కంటే అధిక కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులు తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్