శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కడ్తాల్ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వారు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి సమక్షంలో మంత్రిని కలిసిన వారు రోడ్డు రద్దీగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.