క్రీడలను, ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మౌలిక వసతుల కల్పన చైర్మన్ చల్లా నరసింహారెడ్డి చెప్పారు. శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించిన కడ్తాల్ ప్రీమియర్ లీగ్ - 3 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.