కడ్తాల్: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు

50చూసినవారు
కడ్తాల్: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు
కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో కోతికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో కోతి రోజు తిరుగుతూ ఎవరైనా ఆహారం పెడితే భుజించేదని, ఎవ్వరి నుండి బలవంతంగా లాక్కునేది కాదని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం కోతి అకస్మాత్తుగా హనుమాన్ ఆలయంలో మృతి చెందినది. విషయం గమనించిన గ్రామ సీతారామాంజనేయ స్వామి భజన మండలి సభ్యులు, గ్రామస్తులు మృతి చెందిన కోతికి శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్