రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఎకరాకు 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కందుకూరు చౌరస్తాలో ధర్నా చేపట్టనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరుకానున్నట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.