మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీలో ఈ నెల 13న జరగనున్న బోనాల పండుగ సందర్భంగా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోరుతూ మున్సిపల్ కమిషనర్ కి కౌన్సిలర్లు కేంచే లక్ష్మి నారాయణ, శ్రీధర్ గౌడ్, శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాస్న రవి కుమార్ శనివారం వినతిపత్రం సమర్పించారు. బోనాల పండుగకు ముందుగానే ఈ ఏర్పాట్లు చేయాలని వారు కమిషనర్‌ను అభ్యర్థించారు.