మహేశ్వరం: పేదలకు అండగా సీఎం సహాయ నిధి

51చూసినవారు
మహేశ్వరం: పేదలకు అండగా సీఎం సహాయ నిధి
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా ఉంటుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని లబ్దిదారులకు మంజూరైన ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్