
పాక్కు ఎర వేసి ఉచ్చులోకి లాగిన భారత్
ఈ నెల 9-10 తేదీ రాత్రి వేళల్లో భారత్లోని పౌర నివాసాలు, సైనిక స్థావరాలపై పాక్ డ్రోన్లతో దాడి చేసింది. ప్రతీకార చర్యగా పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ నిర్ణయించుకుంది. వెంటనే వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే డ్రోన్లను గాల్లోకి వదిలింది. వాటిని గుర్తించిన పాక్ రాడార్.. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దాంతో అవి మోహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్.. వాటిని ధ్వంసం చేసింది.