మహేశ్వరం శ్రీశివగంగ రాజరాజేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల పాలక వర్గం సభ్యులకు శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ ఈఓ మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.