మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆశా వర్కర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని, మా పక్షాన అసెంబ్లీలో మా సమస్యల పైన చర్చించాలని సబితా ఇంద్రారెడ్డిని కోరారు.