రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్‌లోని భావన ఋషి కాలనీలోని శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో నవయువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ సమ్మర్ క్యాంపు విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాలపై ఆసక్తిని పెంచుతోంది. ప్రాజెక్టర్ ఆధారిత క్లాసులతో, విజువల్ ప్రెజెంటేషన్‌ల సహాయంతో విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్ నుంచి మధ్యస్థ స్థాయి వరకు శిక్షణ ఇవ్వబడుతోందని క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి గురువారం అన్నారు.