డీఎస్సీ పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. కౌన్సిలింగ్ కు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో తిరిగి ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.