తలకొండపల్లి మండలంలో గత రెండు నెలలుగా వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్లను దొంగిలిస్తూ దొంగలు రైతులను బెంబేలెత్తిస్తున్నారు. వారానికోసారి ఒక్కొక్క ప్రాంతంలో వైర్ల చోరికి పాల్పడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యతో సతమతమవుతున్న తమకు దొంగల బెడద పెద్ద సమస్యగా మారిందని వారు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి ఇబ్బందులు తొలగించాలని బుధవారం వారు కోరుతున్నారు.