తలకొండపల్లి మండలంలోని చంద్రదన, రాంపూర్, బద్నాపూర్ గ్రామాలలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు, చంద్రదన మాజీ సర్పంచ్ బక్కి కుమార్ కోరారు. బుధవారం మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.