స్వతంత్ర సమరయోధుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని శనివారం తలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ నాయకులు మోహన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లు అంజయ్య గుప్తా, అజీమ్ నాయకులు ఓంకారం రవీందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.