తలకొండపల్లి: జేఏసీ నాయకుల అరెస్టు

66చూసినవారు
తలకొండపల్లి: జేఏసీ నాయకుల అరెస్టు
తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు గ్రామం నుండి ప్లకార్డులు చేత బూని నినాదాలు చేస్తూ బయలుదేరుతున్న వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్