దండోరా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే లక్ష డప్పులు వేయి గొంతుల మాదిగ మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ మద్దిలేటి, జిల్లా అధ్యక్షులు నరసింహ కోరారు. శుక్రవారం తలకొండపల్లిలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల స్వార్థానికి రాష్ట్ర ప్రభుత్వం తలోగ్గి వర్గీకరణను జాప్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.