తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన వారు ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో నిర్వహించే ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు.