తలకొండపల్లి: సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికుల ధర్నా

57చూసినవారు
తలకొండపల్లి: సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు తలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క విధంగా కార్మికులకు జీతాలు ఇస్తున్నారని అందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా డ్రెస్సులు, సబ్బుల డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో శ్రీకాంత్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్