తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు అధికారులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహించే ఉత్సవాలకు హాజరు కావాలని ఆమనగల్లు సీఐ ప్రమోద్ కుమార్, తలకొండపల్లి తహశీల్దార్ నాగార్జున, ఎంపీడీవో శ్రీకాంత్, ఎస్సై శ్రీకాంత్, పీఏసీఎస్ ఛైర్మన్ గట్ల కేశవరెడ్డిలకు ఆహ్వాన పత్రాలు అందించారు.