తలకొండపల్లి మండలం దేవుని పడకల్లు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్ మాసం ముగింపును పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మహిళలు మంగళ హారతులతో ఆలయానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగగా భక్తులతో కిటకిటలాడినది.