అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండా, పెద్దూరు తండా, దేవుని పడకల్లు గ్రామాలలో జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఎగురవేసిన ఆయన మాట్లాడుతూ మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని అవమాన పరిశీల వ్యాఖ్యలు చేస్తున్నారని వారి వ్యాఖ్యలను తీప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.