రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు మేళ, సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తలకొండపల్లి మండలం నుండి రైతులు తరలి వెళ్లారు. సదస్సులో ఆధునిక వ్యవసాయం, యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంటలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వీక్షించేందుకు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలు వినేందుకు తరలి వెళ్తున్నట్లు వారు చెప్పారు.