తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గళమెత్తారు. మండల కేంద్రం ఏర్పాటు కోసం చేస్తున్న దీక్షలు శుక్రవారం కొనసాగాయి. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని ప్రభుత్వం మండల కేంద్రంగా ఎందుకు ప్రకటించడం లేదని వారు ప్రశ్నించారు.