తలకొండపల్లి మండలం పడకల్లు పశువుల ఆసుపత్రి డాక్టర్ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని మంగళవారం గొర్రె కాపర్లు ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సంవత్సరం నుండి ఆసుపత్రిలో గొర్రెలకు నట్టల మందు ఇవ్వడం లేదని చెప్పారు. గొర్రెలకు రోగాలు వస్తే మందులు లేవని, బయటికి రాస్తున్నారని అలాంటప్పుడు ఆసుపత్రి ఉండి ఏం లాభం అని వారు ప్రశ్నించారు.