తలకొండపల్లి మండలంలో 37,785 మంది ఓటర్లు ఉన్నట్లు ఎంపీడీవో శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 32 గ్రామ పంచాయతీలలో 272 వార్డులుగా విభజించినట్లు వివరించారు. ఓటర్లలో 19,082 మంది పురుషులు, 18,702 మంది స్త్రీలు, ఒక్కరు ట్రాన్స్ జెండర్ ఉండగా 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, శంకర్, రవి గౌడ్, పాండు, అధికారులు పాల్గొన్నారు.