రంగారెడ్డి: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి
సీపీఎస్ ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు డిమాండ్ చేశారు. అజీజ్‌నగర్‌లో ఆదివారం జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించగా మొయినాబాద్ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. తుకారాం, ప్రధాన కార్యదర్శి వినోద్‌యాదవ్, గౌరవాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కోశాధికారి మహేందర్, ఉపాధ్యక్షురాలిగా లలిత నియమితులయ్యారు.