కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ నగర శివారు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయ పరిసరాలు శుక్రవారం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. దీంతో కీసరగుట్ట అంతటా సందడి వాతావరణం నెలకొంది. ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.