రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగిలోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇంటి ముందు బోధన్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసన చేపట్టినట్లు తెలిపారు. మంత్రి పదవి ఇవ్వని ఎడల బోధన్ నియోజకవర్గం లోని 35 మంది నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు హెచ్చరించారు.